ఫోన్‌ పే సేవలకు యస్‌ బ్యాంకు సెగ

by Shamantha N |
ఫోన్‌ పే సేవలకు యస్‌ బ్యాంకు సెగ
X

ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకు ఎస్‌ బ్యాంకు సంక్షోభం డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేను చుట్టుకుంది. ఆర్థిక సంక్షోభం, ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఫోన్‌పే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అటు ఎస్‌బ్యాంకు ఖాతాదారుల్లోను, ఫోన్‌ పే యూజర్లలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్‌ నిగమ్‌ స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో వివరణ ఇస్తూ ఒక ఓ ట్వీట్‌ చేశారు. దీర్ఘకాలిక అంతరాయానికి చింతిస్తున్నామన్నారు. తన బ్యాంకింగ్‌ భాగస్వామి ఎస్‌బ్యాంకుపై ప్రభుత్వం తాత్కాలిక నిషేదం విధించడంతో తమ సేవలు ప్రభావితమయ్యాయని వివరించారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ సమ్యను పరిష్కరిస్తామని ఆయన తన కస్టమర్లకు హామీ ఇచ్చారు.

తాత్కాలిక నిషేధ నిబంధనల ప్రకారం కరెంట్‌ అకౌంట్లతో కలుపుకొని ఖాతాదారులంతా కూడా ఏప్రిల్‌ 3 దాకా రూ. 50 వేలకు మించి నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉండదు.

tags; yes bank crisis, phone pay, customer get therts, mumbai

Advertisement

Next Story