యెస్ బ్యాంకు కేసు.. రానా కపూర్ ఆస్తులు అటాచ్

by Harish |
యెస్ బ్యాంకు కేసు.. రానా కపూర్ ఆస్తులు అటాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముంబైలో ఉన్న రూ. 127 కోట్ల విలువైన ఫ్లాట్‌తో కలిపి మొత్తం రూ. 900 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. లండన్‌లోని ఈ ఆస్తిని రాణా కపూర్ తరలించే ప్రయత్నాల్లో ఉన్నారని, అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీ కన్సల్టెంట్‌ను నియమించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది.

తాము జరిపిన విచారణలో ఈ ఆస్తి అమ్మకం కోసం పలు వెబ్‌సైట్‌లలో లిస్ట్ చేయబడినట్టు నిర్ధారరించామని ఈడీ పేర్కొంది. అయితే, ఇటీవల రాణా కపూర్‌తో పాటు డీహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు అయిన కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లకు చెందిన రూ. 2,203 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో రాణా కపూర్‌కు చెందిన విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని ఈడీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed