45 వేల మార్కును దాటిన పసిడి!

by Harish |
45 వేల మార్కును దాటిన పసిడి!
X

దిశ, వెబ్‌డెస్క్: అనుకున్నట్టుగానే బంగారం దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో పెట్టుబడిదారులు ఎక్కువగా సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని నమ్ముకుంటున్నారు. దీంతో, బంగారానికి డిమాండ్ పెరిగి 45 వేల మార్కును అధిగమించింది.

ఇండియాలో మంగళవారం బంగారం ధరలు ఒకదశలో 10 గ్రాములు ఏకంగా రూ. 2000 వరకూ పెరిగి రికార్డు స్థాయిని చేరుకుంది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాములు రూ. 45,720 రికార్డు స్థాయిని తాకింది. ఎమ్‌సీఎక్స్ జూన్ ఫ్యూచర్స్ సుమారు 3.6 శాతం పెరిగి రూ. 45,269 కు చేరింది. వెండి కూడా ఎమ్‌సీఎక్స్ మార్కెట్లో 5 శాతం పెరిగి కిలో రూ. 43,345లకు చేరుకుంది. గత వారాంతంలో బంగారం 10 గ్రాములు రూ. 43,722 వద్ద ముగిసింది. సోమవారం సెలవు అనంతరం మంగళవారం కమొడిటీ మార్కెట్లో రూ. 1043 పెరిగి పది గ్రాముల బంగారం రూ. 45,125 వద్ద కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ వల్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఇదే పరిస్థితి ఉండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతెయ మార్కెట్లో సోమవారం నాడు ఔన్స్ బంగారం 2 శాతం పెరిగి 1714 వద్ద ట్రేడయింది. వెండి కూడా ఔన్స్‌కు స్వల్పంగా పెరిగి 14.98 డాలర్లకు చేరింది.

Tags: gold price, gold rate, silver, future market, commodities

Advertisement

Next Story

Most Viewed