- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభలో తెలుగులో మాట్లాడిన వైసీపీ ఎంపీ
దిశ, ఏపీ బ్యూరో: ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి ఇవ్వాల్సిన రూ. 17, 290 కోట్లు తక్షణం రాష్ట్రానికి విడుదల చేయాలని వైసీపీ ఎంపీ వంగా గీత లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా సోమవారం ధాన్యం బకాయిలపై వంగా గీత మాట్లాడారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విభజన హామీలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. చివరకు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలను సైతం ఇవ్వకపోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలు కేంద్రం నుంచి ఇంకా రావాల్సి ఉందన్నారు.
2012 నుంచి ఈ ఏడాది వరకు రూ. 17,290 కోట్లు తక్షణమే మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇకపోతే ధాన్యం బకాయిల సమస్యలను ఇంగ్లీష్‌లో మెుదలు పెట్టిన ఎంపీ వంగా గీత ఆ తర్వాత తాను తెలుగులో మాట్లాడతానని స్పీకర్‌ను కోరారు. అందుకు స్పీకర్ సైతం అనుమతి మంజూరు చేయడంతో ఆమె తెలుగులోనే మాట్లాడారు. ధాన్యం బకాయిలపై సీఎం వైఎస్ జగన్, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిలు సైతం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే ధాన్యం బకాయిలు పూర్తిగా చెల్లించాలని లోక్‌సభలో వంగా గీత కోరారు.
- Tags
- loksabha