- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్లాస్మాదానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే కిలారి..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దేశంలో విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విజృంభిస్తోంది. అంతేగాకుండా మరణాల సంఖ్య కూడా పెరుగుగూ ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య అరికట్టడానికి వైద్యులు ప్లాస్మా థెరపీని వాడుతున్నారు.
అయితే కరోనాను జయించిన వారు ప్లాస్మాను దానం చేయడానికి భయపడుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు సైతం ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్లాస్మాను దానం చేశారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన ప్లాస్మా డోనర్ సెల్‌ను ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
కాగా ఆ ప్లాస్మా డోనర్ సెల్‌లో ఎమ్మెల్యే ప్లాస్మాను దానం చేసారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే కిలారి మాట్లాడుతూ…ప్లాస్మాను దానం చేయడం సంతోషంగా ఉందన్నారు. కరోనా భయాందోళనకు గురుతున్నారని భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.