- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ క్లీన్ స్వీప్.. టీడీపీ డకౌట్
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 54 డివిజన్లకు గానూ 54 డివిజన్లలో విజయం సాధించింది. నెల్లూరు కార్పొరేషన్‌లో 8స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 46 స్థానాలకు ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన 46 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి మెుత్తం 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ విజయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల వ్యూహాలు ఈ గెలుపులో ప్రధానంగా నిలిచాయి. ఇకపోతే ఈ ఎన్నికల్లో టీడీపీ బొక్కబోర్లాపడింది. కనీసం గట్టిపోటీ కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రులు ఇక్కడే మకాం వేసినా ఓటర్లు మాత్రం వైసీపీకే గంపగుత్తగా ఓట్లేశారు. నెల్లూరు కార్పొరేషన్ క్లీన్ స్వీప్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించినట్లైంది.