పెను సంచలనం రేపుతున్న అంబటి రాంబాబు వైరల్ ట్వీట్

by srinivas |
పెను సంచలనం రేపుతున్న అంబటి రాంబాబు వైరల్ ట్వీట్
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసినట్లుగా సంచలన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ఆయన ఆడియో లీకై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అంబటి రాంబాబు తనపై కుట్ర జరుగుతుందంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఏకంగా పార్టీ అధినాయకత్వంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా ఒక ట్వీట్ దుమారం రేపుతోంది. పార్టీ నుంచి బయటకు పొమ్మని చెప్పలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ ట్విటర్ వేదికగా అంబటి వ్యాఖ్యానించినట్లు ట్వీట్ లో ఉంది. అంతేకాదు వైజాగ్‌లోని ఎంవీపీ కాలనీలో ఉన్న ఇంట్లో ఏ2 గెడ్డంగారి అమ్మాయితో జరిపిన రాసలీలలు ఆధారాలతో సహా బయటపెడతానంటూ హెచ్చరించినట్లు ఉంది. అలాగే ఏ1 గారు కాపు కులంపై చేస్తున్న కుట్రలను ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పినట్లు అందులో ఉంది.

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డౌట్ వచ్చి అంబటి రాంబాబు ట్విటర్ తనిఖీ చేయగా అది ఫేక్ అకౌంట్‌ అని తెలుస్తోంది. దీంతో అంబటి అభిమానులు, కార్యకర్తలు తమ నాయకుడిపై కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారు. సుకన్య అనే మహిళతో తమ నేత సంభాషించలేకపోయినప్పటికీ సంభాషించినట్లు ఆడియోలు రావడం..తాజాగా ఫేక్ ఖాతా సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తుండటం చూస్తుంటే తమ నాయకుడిపై ఏదో కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలు కుట్రపన్ని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయా లేక సొంత పార్టీ నేతలే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారా అన్నదానిపై వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed