వంశీకి వైసీపీ అద్దె ఇల్లు లాంటింది !

by srinivas |
వంశీకి వైసీపీ అద్దె ఇల్లు లాంటింది !
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వివాదంపై వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైసీపీ పార్టీ అద్దె ఇల్లు లాంటిదని స్పష్టం చేశారు. వైసీపీ నా పార్టీ అని.. నా కార్యకర్తలను వంశీ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారని, భవిష్యత్‌లో వంశీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని సీఎం జగన్‌ను కలిసి వివరించినట్లు వెల్లడించారు. పోలీసులు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారని, ఎందుకిలా చేస్తున్నారని అడిగితే మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని చెబుతున్నారని వాపోయారు. ఎన్నికల సమయంలో మా ఇంటి దగ్గర వంశీ కవ్వింపు చర్యలు చేసి, దుర్భాషలాడరని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story