- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అసలు, వడ్డీలు కట్టేందుకే లక్ష కోట్లు కావాలి’
X
దిశ ఏపీ బ్యూరో: 2024 నాటికి వడ్డీ, అసలు చెల్లింపులకే లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. వైఎస్సార్సీపీ నేతల అసమర్థ పాలన కారణంగా ఏపీ క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని ఆరోపించారు. దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోస్థానంలో ఉందని ఆయన వెల్లడించారు. దీంతో రానున్న ఐదేళ్లలో ఏపీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.
ఏపీలో రివర్స్ టెండరింగ్, రివర్స్ గ్రోత్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని ఆయన విమర్శించారు. ఏపీలో భూముల వేలాన్ని బిల్ట్ ఏపీ మిషన్ అని పేర్కొనడం కన్నా బిల్ట్ వైఎస్సార్సీపీ మిషన్ అనడం సబబని ఆయన పేర్కొన్నారు. జగన్ పాలనలో తప్పొప్పులను సమీక్షకు తావు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Advertisement
Next Story