‘ప్రజల భవిష్యత్ గాలికొదిలేశారు’

by srinivas |
‘ప్రజల భవిష్యత్ గాలికొదిలేశారు’
X

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతల కోసమే పనిచేస్తూ.. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను గాలికొదిలేశారని టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, చినరాజప్పలు విమర్శించారు. రాష్ట్రంలో భూ, ఇసుక మాఫియాలు రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ప్రజావ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబును అడ్డుకున్నారని తెలిపారు. ప్రజాపంపిణీ స్థలాల కోసం దళితుల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. రెండు రోజుల్లో విశాఖ నుంచి ప్రజాచైతన్య యాత్ర ప్రారంభించనున్నామని వెల్లడించారు.

Advertisement

Next Story