‘విద్యార్థుల చదువుకు స్మార్ట్ ఫోన్’.. ‘డిజిటల్ సాథి’గా యామీ పిలుపు

by Shyam |
‘విద్యార్థుల చదువుకు స్మార్ట్ ఫోన్’.. ‘డిజిటల్ సాథి’గా యామీ పిలుపు
X

దిశ, సినిమా : హీరోయిన్ యామీ గౌతమ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డిజిటల్ సాథి’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. పాండమిక్ కారణంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సాధారణం అయిపోగా.. చాలా మంది పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ లేక వర్చువల్ క్లాస్‌లకు అటెండ్ కాలేకపోతున్నారు. దీంతో చదువులో వెనుకబడుతున్నారు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ సర్కార్ ‘సమగ్ర శిక్షా అభియాన్’ పథకం కింద ‘డిజిటల్ సాథి.. బచ్చో కా సహారా- ఫోన్ హమారా’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బేసిక్ టెక్నాలజీ ఫెసిలిటీస్ లేని విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ అందించాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రోగ్రామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకమైన యామీ గౌతమ్.. సరైన సదుపాయాలు లేని చిన్నారులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరింది. స్మార్ట్ ఫోన్ డొనేట్ చేసి విద్యార్థుల చదువుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేసింది.

Advertisement

Next Story