రైతుల కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం : ఆర్.నారాయణ మూర్తి

by Shyam |
R.Narayana Murthy, Yadadri CPM office
X

దిశ, భువనగిరి రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అన్నదాతలను ఆదుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రపంచానికి అన్నం పెట్టింది అన్నదాత మాత్రమే అని గుర్తుచేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్, సోషల్ చట్టాలను ఎత్తేయాలని కోరారు. ఆ చట్టాలు అమలులోకి తీసుకొస్తే వ్యవసాయం ప్రైవేటీకరణ అవుతుందని అన్నారు.

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే రైతులను ఉచిత కరెంట్ కరువు అవుతుందని తెలిపారు. ఢిల్లీలో రైతులు చేస్తోన్న పోరాటం న్యాయమైనదేనని, రైతుల కోసం ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధం అని, ఒక కళాకారునిగా తాను రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నానని అన్నారు. అంతేవిధంగా.. ఇటీవల తాను తీసిన ‘రైతన్న’ సినిమాను రైతులు అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆ సినిమాలో వ్యవసాయ చట్టాల లోటుపాట్ల గురించి క్లుప్తంగా వివరించామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed