- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పూజలు చేశారు.. దెబ్బలు తిన్నారు!
దిశ,ఆర్మూర్: అర్ధరాత్రి శ్మశాసంలో క్షుద్రపూజలు చేసిన కుటుంబీలను గ్రామస్తులు చితకబాదారు. రాత్రి సమయంలో శ్మశానం నుంచి అరుపులు వినిపించడంతో అటుగా వెళ్లిన గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. ఓ ఆయుర్వేద డాక్టర్ కుటుంబంతో కలిసి క్షుద్ర పూజలు చేస్తుండడంతో దేహశుద్ది చేశారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం..
కలకత్తాకు చెందిన సమీర్ రాయ్ పదిహేనేళ్ల క్రితం బతుకు దేరువుకోసం ఆర్మూర్ వచ్చాడు. పట్టణంలో ఆయుర్వేద డాక్టర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఆయన గత రాత్రి ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులతో కలిసి క్షుద్రపూజలు ప్రారంభించారు. పూజల సమయంలో మంత్రాల శబ్ధం రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి అటుగా వెళ్లి పరిశీలించారు.
డాక్టర్ సమీర్ రాయ్ కుటుంబంతో కలిసి క్షుద్రపూజలు చేస్తుండడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎందుకు పూజలు చేస్తున్నరంటు చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే శ్మశానానికి చేరుకుని సమీర్ రాయ్ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన ఇంట్లో తరచు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పురోహితుని సలహా మేరకు పూజలు చేసినట్లు సమీర్ రాయ్ చెప్పారు.