- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ భవన్‌కు భూమి పూజ.. ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు దూరం
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ నిర్వహించారు. సీఎం కేసీఆర్ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూదేవతకు మధ్యాహ్నం 1.48గంటలకు పూజలు చేశారు. కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్, మంత్రులు జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, రాములుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యదర్శులు, టీఆర్ఎస్వీ తదితరులు పాల్గొన్నారు. తిరిగి 3వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
భూమి పూజకు వారంతా దూరం
ప్రతిష్ఠాత్మకంగా ఢిల్లీలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ భూమిపూజ కార్యక్రమానికి పలువురు మంత్రులు దూరంగా ఉన్నారు. అందరూ హాజరవుతున్నారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించినప్పటికీ హాజరుకాలేదు. ఎమ్మెల్యేలు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. మంత్రి హరీష్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి సైతం హాజరుకాలేదు. దీంతో ఎందుకు హాజరుకాలేదని పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు.