- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ‘ఎలక్ట్రికల్ బస్సులు’.. ఎక్కడంటే
దిశ, ఫీచర్స్ : పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల వాడకం వల్ల కర్బన ఉద్గారాలు గణనీయ స్థాయిలో విడుదలై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని దేశాలు ప్రజారవాణా నిమిత్తం ఎలక్ట్రిసిటీతో నడిచే e-వెహికల్స్‌ను యూజ్ చేస్తుండగా.. తాజాగా అరబ్ కంట్రీలోనూ ప్రజారవాణా కోసం ఈ తరహా బస్సులను వాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జయ్యే ఈ-వెహికల్స్(ఎలక్ట్రిసిటీ) కాగా.. త్వరలోనే ఇవి అబుదాబి సిటీలో అందుబాటులోకి రానున్నాయి.
ఇటీవలే యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోని దుబాయ్ సిటీలో ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై పరీక్షించిన అధికారులు.. e-buses రోడ్లపై నడుస్తుండగా ఉపరితలం నుంచి ఎలక్ట్రిసిటీని గ్రహిస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాత, ఇప్పుడు అబుదాబిలో ఇంట్రడ్యూస్ చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా కేవలం 20 నిమిషాల్లోనే చార్జ్ కానున్న ఈ బస్సులను ఎమిరేట్స్ సంస్థ అల్ ఫహిం గ్రూప్, చైనాకు చెందిన యిన్లాంగ్ ఎనర్జీ సంయుక్తంగా తయారు చేశాయి. ఈ ఎకో ఫ్రెండ్లీ స్మార్ట్ బస్సులతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండకపోగా, కర్బన ఉద్గారాల తగ్గింపులో వీటి పాత్ర కీలకం. ఇక వీటి తయారీలో ఉపయోగించిన ప్రత్యేకమైన లిథియం టిటనేట్ ఆక్సైడ్(LTO) సెల్స్ బ్యాటరీ.. 20 నిమిషాల్లోనే చార్జ్ అయ్యేందుకు దోహదపడుతుంది. కాగా ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవడంలో అబుదాబి ఎప్పుడూ ముందుంటుందని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.