Houthi rebels: ఉద్రిక్తతల వేళ అమెరికాకు షాక్.. MQ-9 రీపర్‌ డ్రోన్ ను కూల్చివేసిన హౌతీలు

by Shamantha N |
Houthi rebels: ఉద్రిక్తతల వేళ అమెరికాకు షాక్.. MQ-9 రీపర్‌ డ్రోన్ ను కూల్చివేసిన హౌతీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: హౌతీలు అమెరికాకు మరోసారి షాక్ ఇచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు వేళ.. ఈ ఘటన జరిగింది. అమెరికాకు (USA) చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్‌ను హూతీలు (Houthis) కూల్చివేశారు. ఆదివారం తెల్లవారుజామున యెమెన్‌ (Yemen)లోని హౌతీలకు చెందిన గగనతలంలో ఎగురుతున్న MQ-9 రీపర్‌ డ్రోన్‌ (US MQ 9 drone)ను కూల్చివేసింది. ఈ విషయాన్ని హౌతీ బృంద ప్రతినిధి యాహ్యా సారీ వెల్లడించారు. హౌతీ నియంత్రణలోని భూభాగంపై అమెరికా ఎయిర్ స్ట్రయిక్ చేసినట్లు ఆరోపించారు. అయితే, అమెరికన్ మిలిటరీ డ్రోన్‌లు కూల్చివేసినట్లు "ఎలాంటి నివేదికలు అందలేదు" అని పేర్కొన్నారు.

2014 నుంచి దాడులు

ఇకపోతే.. 2014లో యెమెన్‌ రాజధాని సనాను హూతీలు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్నుంచి అమెరికాకు చెందిన పలు డ్రోన్లను తిరుగుబాటుదారులు కూల్చేశారు. అయితే.. ఈ విమానాన్ని ఏ విధంగా కూల్చివేశారో స్పష్టం చేయలేదు. 24 గంటలపాటు సుమారు 50 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ కీలక సమాచారం సేకరించే సామర్థ్యం MQ-9 రీపర్‌ డ్రోన్‌ ఉంటుంది. దీని విలువ సుమారు 30 మిలియన్ల డాలర్లు (రూ.251 కోట్లకు పైగా). ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఆ దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ దాడుల వల్ల పాలస్తీనా ప్రజలు నష్టపోతున్నారు. అందుకే యెమెన్ కేంద్రంగా ఇరాన్ కు మద్దతుగా హౌతీ తిరుగుబాటుదారులు రెడ్ సీలోని వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. పాలస్తీనా ప్రజలు, యెమెన్‌ రక్షణ కోసం హూతీలు దాడులు కొనసాగిస్తూనే ఉంటారని హౌతీలు పేర్కొన్నారు. ఇటీవల గల్ఫ్‌ ఆఫ్ ఆడెన్‌లో ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై హూతీలు దాడికి పాల్పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed