Madrassas : 4,191 అన్ ఎయిడెడ్ మదర్సాల ఆర్థిక మూలాలపై ఏటీఎస్ విచారణ

by Hajipasha |
Madrassas : 4,191 అన్ ఎయిడెడ్ మదర్సాల ఆర్థిక మూలాలపై ఏటీఎస్ విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రభుత్వ సాయం పొందని 4,191 అన్ ఎయిడెడ్ మదర్సాల ఆర్థిక మూలాలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) గురువారం విచారణను ప్రారంభించింది. ఈ విచారణను ఎదుర్కొంటున్న దాదాపు 495కుపైగా అన్ ఎయిడెడ్ మదర్సాలు ఒక్క బహ్రైచ్ జిల్లాలోనే ఉన్నాయి. ఏటీఎస్ దర్యాప్తు లిస్టులో ఉన్న దాదాపు 100కుపైగా మదర్సాలు భారత్ - నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. ఈవివరాలను బ్రహైచ్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సంజయ్ మిశ్రా వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.రీబా ఈనెల 21న అన్ని జిల్లాల మైనారిటీ సంక్షేమ అధికారులకు సంచలన ఆదేశాలతో ఒక లేఖను పంపారు. రాష్ట్రంలోని అన్ని అన్ ఎయిడెడ్ మదర్సాల ఆర్థిక మూలాలపై విచారణ జరపాలని ఆ లేఖలో ప్రస్తావించారు. విచారణను ఎదుర్కోవాల్సిన 4,191 అన్ ఎయిడెడ్ మదర్సాల వివరాలతో కూడిన లిస్టును ఏటీఎస్ డీజీపీకి అందజేశామన్నారు. ఆయా మదర్సాలకు నిధులు ఎలా సమకూరుతున్నాయనే దానిపై ఎక్కడికక్కడ దర్యాప్తు చేసి నివేదికను పంపాలని యూపీలోని ఏటీఎస్ యూనిట్లకు ఆదేశాలు వెళ్లాయి.

Advertisement

Next Story

Most Viewed