NIA : ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్ దాలా సన్నిహితుడి అరెస్ట్

by Hajipasha |
NIA : ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్ దాలా సన్నిహితుడి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : కెనడాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్ దాలా సన్నిహిత అనుచరుడు బల్జీత్ సింగ్‌‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. బల్జీత్ సింగ్ పంజాబ్‌లోని భటిండా వాస్తవ్యుడు. యూఏఈ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) కోసం భారత్‌లో యువకులను రిక్రూట్ చేయడం, వారికి వనరులను సమకూర్చడం, బెెదిరింపు- దోపిడీ ప్రణాళికలు రచించి అమలుపర్చడం వంటి పనులన్నీ బల్జీత్ సింగ్‌‌ చేస్తుండేవాడని వెల్లడించారు.

కేటీఎఫ్ తరఫున ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు మరిన్ని కేసులు కూడా అతడిపై ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. కాగా, కెనడాలో హత్యకు గురైన ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కూడా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) సంస్థ సభ్యుడే. ఈ ఉగ్ర సంస్థకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నుంచి కూడా నిధులు అందుతుంటాయి.

Advertisement

Next Story

Most Viewed