వాంటెడ్ లిస్టు నుంచి గోల్డీ బ్రార్‌‌ను తొలగించిన కెనడా

by Mahesh Kanagandla |
వాంటెడ్ లిస్టు నుంచి గోల్డీ బ్రార్‌‌ను తొలగించిన కెనడా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గోల్డీ బ్రార్ కెనడాలో ఉంటున్నాడని తెలిపారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే ఆయనను వాంటెడ్ లిస్ట్‌లో పెట్టారని, ఉన్నట్టుండి ఇప్పడు ఆయన పేరును వాంటెడ్ లిస్ట్‌లో నుంచి తొలగించారని వివరించారు. ఆయనను అరెస్టు చేశారా? లేక ఆయన ఇక వాంటెడ్ లిస్ట్‌లో ఉండాల్సిన అవసరం లేదని భావించారా? అనేదే ఆలోచనకు తడుతుంది కదా అని పేర్కొన్నారు.

డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి వాటిపై యాక్షన్ తీసుకున్నప్పుడు ప్రపంచంలోనే చాలా చోట్ల మర్డర్లు జరిగాయని వర్మ వివరించారు. గోల్డీ బ్రార్ కెనడాలో ఒక గ్యాంగ్ నడుపుతున్నాడని, అలాంటి గ్రూపులో ఆ దేశంలో చాలా ఉన్నాయని తెలిపారు. గోల్డీ బ్రార్ కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఒకరిగా ఉన్నారని భావించామని, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత గోల్డీ బ్రార్ పేరు ఎక్కువ ప్రచారంలోకి వచ్చిందని వివరించారు. కానీ, ఇప్పుడు వీరిద్దరూ సెపరేట్ గ్యాంగ్‌లు నడుపుతున్నట్టు సమాచారం.

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను తప్పే అని వర్మ చెప్పారు. సమగ్ర దర్యాప్తు తర్వాత వాస్తవం బయటికి వస్తుందని వివరించారు. ‘నిజ్జర్ మనకు ఒక ఉగ్రవాది, కానీ, ఒక ప్రజాస్వామ్యంలో, చట్టబద్ధ పాలన ఉన్న దేశంలో చట్టవ్యతిరేకంగా జరిగే హత్యను కచ్చితంగా తప్పే అవుతుంది’ అని సంజయ్ కుమార్ వర్మ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed