Vizag: ప్రేమ వేధింపులకు మరో యువతి బలి

by Rani Yarlagadda |
Vizag: ప్రేమ వేధింపులకు మరో యువతి బలి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ వేధింపులకు మరో యువతి బలయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివింది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్ గా పనిచేస్తోంది. యువతి కుటుంబం ఉంటున్న గ్రామంలోనే ఉంటున్న పిల్లి రాజు(26) కొన్నేళ్లుగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

తాను ప్రేమిస్తున్నానని, తన ప్రేమను అంగీకరించి తిరిగి ప్రేమించాలని పదే పదే వేధించేవాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకపోవడంతో.. చావే శరణ్యం అనుకుంది. నవంబర్ 16వ తేదీ సాయంత్రం పొలాల్లో జల్లేందుకు ఇంట్లో ఉంచిన పురుగుల మందును తాగింది. వాంతులు కావడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన తరగరపువలసలో ఉన్న ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. గురువారం (నవంబర్ 21)న మృతి చెందింది. విషయం పోలీసులకు తెలియడంతో.. శుక్రవారం ఉదయం రాజును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇదంతా జరిగి రెండ్రోజులైనా విషయం బయటికి రాకుండా ఉంచారు.

Advertisement

Next Story