Kothagudem: ఆహ్లాదం పంచని ప్రకృతి వనం..? అంతటా అపరిశుభ్ర వాతావరణం

by Ramesh Goud |
Kothagudem: ఆహ్లాదం పంచని ప్రకృతి వనం..? అంతటా అపరిశుభ్ర వాతావరణం
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంపై అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే అలంకారప్రాయంగా మిగిలిపోయింది. ప్రకృతి వనం ప్రారంభంలో పచ్చని మొక్కలతో కళకళలాడినా... నేడు ఎండిపోయి పశువులకు, మందుబాబులకు అడ్డాగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాకింగ్ ట్రాక్ అధ్వానంగా మారగా... కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బేంచీల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. ఫౌంటెన్ సైతం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ఉదయం, సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్‌తో పాటు సేద తీరడానికి పల్లె ప్రకృతి వనంలో అడుగు పెడితే విషసర్పాలు, పశువులు కనిపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లెప్రకృతి వనం దుస్థితిపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని వాపోతున్నారు.

దిశ, కొత్తగూడెం రూరల్: ప్రతి పంచాయతీ మున్సిపాలిటీ పరిధిలో గత పాలకుల హాయంలో ఏర్పాటైన పల్లె ప్రకృతి వనాలు వెలవెల పోవడంతో పాటుగా మద్యం ప్రియులకు అడ్డగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రకృతి వనాలపై సరైన పర్యవేక్షణ లేని కారణంగా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ప్రకృతి వనాల ఏర్పాటుకు లక్షలు ఖర్చు చేసినప్పటికీ లక్ష్యం నెరవేరకపోగా ప్రజలకు మాత్రం ఆహ్లాదకర వాతావరణాన్ని అందించలేకపోతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలో విద్యానగర్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ప్రజల కోసమా..? మందుబాబుల కోసమా..? అంటూ పలువురు అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనంపై పర్యవేక్షణ లేని కారణంగానే అలంకారప్రాయంగా కనబడుతుందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వనం ప్రారంభ సమయంలో పచ్చని మొక్కలతో కళకళలాడిన నేడు ఎండిపోయి పశువులకు మందుబాబులకు అడ్డాగా నిలుస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాకింగ్ ట్రాక్ అధ్వానంగా మారడంతో వాకింగ్ చేసేవారికి ఇబ్బందికరంగా మారింది. కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయగా వాటి చుట్టూ పనికిరాని పిచ్చి మొక్కలు వెలసి ఉన్నాయి. ఫౌంటెన్ సైతం నిరుపయోగంగా దర్శనమిస్తుంది. అంతేకాకుండా విష సర్పాలకు నిలయంగా కూడా పల్లె ప్రకృతి వనం ఉందని పలువురు పేర్కొంటున్నారు. గతంలో పల్లె ప్రకృతి వనం దుస్థితిపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందనలేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్ తో పాటు సెద తీరడానికి పల్లె ప్రకృతి వనంలో అడుగు పెడితే పోతే విష సర్పాలు పశువులు కనబడుతున్నాయని విద్యానగర్ వాసులు అసహనాన్ని వెలబుచ్చుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అపరిశుభ్రంగా మారిన పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా చూడాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

పల్లె ప్రకృతి వనాలపై పర్యవేక్షణ ఏది: సామాజిక కార్యకర్త బానోత్ హరి నాయక్

చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి సుజాతనగర్ పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీలలో ఉన్న పల్లె ప్రకృతి వనాలు చాలావరకు అలంకారప్రాయంగా నిలిచాయి. ఆహ్లాదాన్ని అందించే పల్లె ప్రకృతి వనాలపై సంబంధిత అధికారుల సరైన పర్యవేక్షణ లేదు. లక్షల ఖర్చు చేసి ఏర్పాటైన ప్రకృతి వనాలు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణ అందించలేకపోతున్నాయి. చలికాలాన్ని రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పల్లె ప్రకృతి వరాలు పచ్చదనంతో కళకళలాడే విధంగా చర్యలు చేపట్టాలి.

శుభ్రం చేయిస్తాం: ఎంపీడీవో అశోక్ కుమార్

విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పల్లె ప్రకృతి వనంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయిస్తాం. ఆహ్లాదకర వాతావరణ కలిగించే విధంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కొత్త మొక్కలు నాటించే కార్యక్రమం చేపడతాం. వాకింగ్ ట్రాక్ చుట్టు పేరుకుపోయిన చెత్తను కూడా తొలగించే ప్రజలకు ఉపయోగపడే విధంగా చూస్తాం.

Advertisement

Next Story

Most Viewed