Diwali : పెన్సిల్వేనియాలో ప్రభుత్వ సెలవుదినంగా దీపావళి

by Hajipasha |
Diwali : పెన్సిల్వేనియాలో ప్రభుత్వ సెలవుదినంగా దీపావళి
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజానీకానికి గుడ్ న్యూస్ వినిపించింది. దీపావళి పండుగను రాష్ట్ర ప్రభుత్వ సెలవుదినంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక బిల్లును ఆమోదిస్తూ గవర్నర్ జోష్ షాపిరో సంతకం చేశారు. ఈ నిర్ణయాన్ని తమ రాష్ట్రంలో నివసించే ఎంతోమంది హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు అందిస్తున్న అపురూప కానుకగా అభివర్ణించారు.

అన్ని వర్గాల ప్రజల సంప్రదాయాలను పెన్సిల్వేనియా రాష్ట్రం గౌరవిస్తోంది అనేందుకు ఈ నిర్ణయమే నిదర్శమన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం తమ రాష్ట్రంలో దీపావళి రోజున పబ్లిక్ హాలిడే ఉంటుందని గవర్నర్ జోష్ షాపిరో తెలిపారు. ఆ రోజున స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారాలను మూసివేస్తారని చెప్పారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ నవంబరు 5న జరగబోతోంది.

Advertisement

Next Story

Most Viewed