- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడుగు దూరంలోనే మూడో ప్రపంచ యుద్ధం: పుతిన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి, రష్యా దళాలు నేరుగా తలపడితే ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధానికి అడుగు దూరంలో మాత్రమే నిలుస్తుందని అన్నారు. అయితే అలాంటి పరిస్థితులను ఎవరూ కోరుకోవడం లేదని తెలిపారు. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఇప్పటికే నాటో దళాలు మోహరించాయని పుతిన్ గుర్తు చేశారు. పాశ్చాత్య దేశాలు రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నాయని, అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. కాగా, నాటో దళాలు, రష్యా మధ్య యుద్ధం పొంచి ఉందని ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పుతిన్ స్పందిచడం గమనార్హం.
అమెరికాలో ప్రజాస్వామ్యమే లేదు
రష్యా తన భూభాగాన్ని రక్షించుకోవడానికి ఉక్రెయిన్‌లో బఫర్ జోన్‌ను సృష్టించడానికి కూడా వెనుకాడబోమని పుతిన్ చెప్పారు. రష్యా ఇప్పుడు మరింత శక్తివంతంగా తయారైందని తెలిపారు. అమెరికా ఎన్నికలపైనా పుతిన్ స్పందించారు. యూఎస్ ఎన్నికలు స్వేచ్చగా, న్యాయంగా లేవని తెలిపారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాలను చూసి ప్రపంచమంతా నవ్వుతోందని ఎద్దేశా చేశారు. అక్కడ ప్రజాస్వామ్యం లేనే లేదని స్పష్టం చేశారు. ట్రంపునకు వ్యతిరేకంగా రాజ్యాధికారాన్ని ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
ఐదో సారి అధ్యక్షుడిగా ఎన్నిక
వ్లాదిమిర్ పుతిన్ వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడయ్యాడు. మార్చి 15,17 తేదీల్లో జరిగిన ఓటింగ్‌లో పుతిన్‌కు 88శాతం ఓట్లు వచ్చాయి. అతని ప్రత్యర్థికి నికోలాయ్ ఖరిటోనోవ్‌కు 4శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగతా ఇద్దరు ప్రత్యర్థులు వ్లాడిస్లావ్ దావన్కోవ్, లియోనిడ్ స్లట్స్కీ మూడు నాలుగు స్థానాలకే పరిమితమయ్యారు. పుతిన్ మొదటి సారిగా 2000 సంవత్సరంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు.