- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
5 నిమిషాల పార్కింగ్ చార్జ్ రూ.11 లక్షలు.. ఎక్కడో తెలుసా..?
దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్ కు చెందిన ఓ మహిళ పార్కింగ్ నిబంధనలు అతిక్రమించినందుకు ఏకంగా రూ.11 లక్షలు ఫైన్ కట్టాల్సి వచ్చింది. పార్కింగ్ ఫైన్ మహా అయితే వెయ్యి రూపాయలు వస్తుందని అంచనా వేసిన ఆ మహిళ అంత బిల్లు రావడంతో అవాక్కయింది. బ్రిటన్ లోని దర్హమ్ కౌంటీకి చెందిన హెన్నా రాబిన్సన్ ఫీథమ్ లీజర్స్ సెంటర్లో గత నాలుగేళ్లుగా తన వాహనాన్ని పార్కింగ్ చేస్తోంది. కాగా ఈ సెంటర్లో 5 నిమిషాల పార్కింగ్ రూల్ అమల్లో ఉంది. అంటే వాహనం పార్క్ చేసిన 5 నిమిషాల్లో పార్కింగ్ ఫీజు చెల్లించాలి. లేదంటే అతిక్రమణ కింద 170 పౌండ్లు (రూ.1800) కట్టాల్సి ఉంటుంది. గత నాలుగేళ్లుగా 67 సార్లు ఈ 5 నిమిషాల నిబంధన అతిక్రమించినందుకు గాను ఏకంగా 11 వేల పౌండ్లు (రూ.11 లక్షలు) జరిమానా విధించారు అధికారులు. బ్రిటన్ లోని కఠిన చట్టాల ప్రకారం చేసేదేం లేక హెన్నా ఆ జరిమానా మొత్తం కట్టగా.. సోషల్ మీడియాలో ఈ కథనం వైరల్ అవుతోంది. అంతేకాదు తాము కూడా అలాంటి భారీ జరిమానా కట్టినట్టు చాలామంది కామెంట్లలో తెలియజేస్తున్నారు.