- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నీరు పెట్టిస్తున్న త్రిబుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ఆత్మహత్య లేఖ
దిశ, బాసర: త్రిబుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ఆత్మహత్య లేఖ తల్లిదండ్రులతో పాటు స్నేహితులను, గ్రామస్తులను కన్నీరు పెట్టిస్తుంది. స్వాతి తన లేఖలో "మమ్మీ డాడీ నన్ను క్షమించండి. నాకు వేరే దారి కనిపించడం లేదు అందుకే చనిపోతున్నాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. నాకు నేనుగా తీసుకున్న నిర్ణయానికి లోబడి చనిపోతున్నాను అంటూ 6 పేజీల లేఖలో తన చావు గురించి ప్రస్తావించింది. అందులో "సారీ మమ్మీ సారీ డాడీ నేను ఇలా చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకో మనసు ఒప్పట్లే.. మమ్మీ నాకు ఎప్పుడు చూసినా చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఎందుకో చాలా భారంగా ఉంది. మమ్మీ మీ కూతురు అని కాదు మీకు కొడుకుల ఉందాం అనుకున్న.. కానీ చిన్నపిల్లల ఏడుస్తున్న.. "నా చావుకు ఎవరూ కారణం కాదు" కాలేజ్ ఫ్రెండ్స్ అని ఎవరు కాదు నా లాస్ట్ కోరిక మన వినోద్ అన్న ఉండు కదా ఆ అన్నని పెద్దనాన్న వాళ్లు అనాధ ఆశ్రమంలో వదిలేశారు. ఆ అన్న రోడ్లమీద బిక్షం అడుక్కుంటున్నాడు. అన్నకి మంచిగా ఫుడ్ పెట్టి బాగా చూసుకోండి. నేను లేని లోటు అన్న తీరుస్తాడు. ఇంకొకటి నా ఫ్రెండ్స్ మా అన్నలు అందరు నన్ను చూడడానికి రావాలి. మీరు ఎవరెవరితో గొడవపడ్డారో మన రిలేటివ్స్‌లో వాళ్లు అందరూ రావాలి. మమ్మీ నన్ను తాత పక్కన పూడ్చిపెట్టండి, తాతతో ఉన్నట్టు అనిపిస్తుంది.
ఎందుకో తప్పు చేస్తున్నా అని అనిపిస్తుంది. కానీ నావల్ల అవ్వట్లేదు. మమ్మీ అక్క తమ్ముడు వాళ్ళను బాగా చూసుకో.. అక్క తమ్ముడుని వాళ్ళకి నచ్చిన స్టడీ, జాబ్ చేయించు. అక్కకి నచ్చిన పెళ్లి చేయండి. తమ్ముడికి హాస్టల్లో ఉండాలని లేదు. వాడిని బయటనే జాయిన్ చేయండి. డాడీ నువ్వు స్మోకింగ్ మానేయాలి, అలాంటి తప్పులు చేయకండి, మంచిగా ఉండండి, నా టెన్త్ ఫ్రెండ్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్‌కి బాసరలో ఉన్న ఫ్రెండ్స్‌కి చెప్పండి.. నాకు క్లోజ్‌గా ఉన్నవాళ్లు వచ్చి నన్ను లాస్ట్ టైం హగ్ చేసుకోవాలి. నేను చచ్చిపోయాక నావల్ల మీరు చాలా బాధపడతారు నాకు తెలుసు.. కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. నాకు దూరం అయ్యాక మా ఫ్రెండ్స్‌కి నాతో ఉన్న ఫ్రెండ్స్‌కి అందరికీ ఐలవ్‌యు, మై ఫాలోవర్స్ అందరికీ ఐలవ్‌యు నా ఫోన్ ఆన్లైన్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయట్లే అని ఫీల్ అవుతారు. అక్క వాళ్ళకి మెసేజ్ పెట్టు "swathi is no more" "she is died" అని పెట్టు. మంచిగా చదువుకో అక్కా".. అని స్వాతి రాసిన లేఖలో ఉంది.