- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Amit Shah: మరోసారి 'రాహుల్ బాబా' విమానం కూలిపోతుంది: అమిత్ షా సెటైర్లు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి ఇండియా కూటమి, ప్రధానంగా కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ టార్గెట్‌గా ఇప్పటికే 20 సార్లు కుప్పకూలిన 'రాహుల్ బాబా' విమానం నవంబర్ 20న జరిగే ఎన్నికల్లో మరోసారి కూలడం ఖాయమన్నారు. బుధవారం పర్భాని జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా.. రాహుల్ బాబా పేరున్న విమానాన్ని 20 సార్లు ల్యాండింగ్ కోసం సోనియా గాంధీ ప్రయత్నించారు, అన్నిసార్ల్లు అది కూలిపోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 21వ సారి విమానాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈసారి కూడా కూలిపోతుందని విమర్శించారు. ఇదే సమయంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా ఏళ్ల తరబడి నిలిపేసిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరాన్ని నిర్మించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను కూడా నిర్మించారని గుర్తుచేశారు. రాహుల్ బాబా పార్టీ కాంగ్రెస్, ఆయన దగ్గరగా ఉన్నవారు కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని తీర్మానం చేశారు. మీరే కాదు, మీ తర్వాతి తరం వచ్చినా ఆర్టికల్ 370ని తిరిగి రాదని అమిత్ షా ఆరోపణలు చేశారు.