- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Tech Jobs: 2028 నాటికి కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు
దిశ, బిజినెస్ బ్యూరో: వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ 2028 నాటికి 27.3 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలను సృష్టించగలదని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ప్లాట్‌ఫామ్ సర్విస్‌నౌ బుధవారం ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో భారత శ్రామిక శక్తి 42.37 కోట్ల నుంచి 2028 నాటికి 45.76 కోట్లకు పెరగనుంది. గత కొంతకాలంగా ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతాయనే ఆందోళనల మధ్య ఈ నివేదిక రావడం గమనార్హం. పెరగనున్న ఉపాధి ప్రధానంగా రిటైల్ రంగంలో ఉండనున్నాయని, ఈ పరిశ్రమ పెరుగుదలకు అనుగుణంగా 69.6 లక్షల కొత్త ఉద్యోగులు అవసరమని నివేదిక తెలిపింది. దీని తర్వాత తయారీ(15 లక్షలు), విద్య(8.4 లక్షలు), ఆరోగ్య సంరక్షణ(8 లక్షలు) కొత్త ఉద్యోగాలను కల్పించనున్నాయి. భవిష్యత్తులో భారత వృద్ధికి కీలకంగా ఏఐ మారనుందని, ముఖ్యంగా టెక్ నైపుణ్యం అవసరమైన కీలక స్థాయిలలో ఏఐ వినియోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ, బిజినెస్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుమీత్ మాథూర్ చెప్పారు. కంపెనీలు ఖర్చులు తగ్గించేందుకు, ఉద్యోగుల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఏఐ వైపు మళ్లుతున్నప్పటికీ నైపుణ్యం, కీలక స్థాయిలలో ఉద్యోగుల అవసరం అదే స్థాయిలో ఉంటుందని నివేదిక పేర్కొంది.