- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Bitcoin: 91,000 డాలర్లు మార్కు దాటిన బిట్‌కాయిన్
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో క్రిప్టో మార్కెట్ హద్దుల్లేకుండా దూసుకెళ్తోంది. గతవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గరి నుంచి క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ 25 శాతానికి పైగా పుంజుకుంది. తాజాగా బుధవారం సైతం బిట్‌కాయిన్ విలువ 91,000 డాలర్ల మైలురాయిని అధిగమించింది. ఓ దశలో 93,000 డాలర్ల మార్కు దాటిన బిట్‌కాయిన్ ఆ తర్వాత నెమ్మదించింది. ఎన్నికల సమయంలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి ట్రంప్ ఇచ్చిన హామీల కారణంగానే బిట్‌కాయిన్ రోజుకొక కొత్త రికార్డులను అధిగమిస్తోంది. భవిష్యత్తులో బిట్‌కాయిన్ మరిన్ని రికార్డులను సాధిస్తుందని క్రిప్టో మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు సైతం పెరుగుతున్నాయి. ఈథర్ గడిచిన 10 రోజుల వ్యవధిలో 30 శాతం మేర పెరిగింది. క్రిప్టోకరెన్సీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు 3.02 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. బిట్‌కాయిన్ 59.6 శాతంతో ఆధిపత్యం కలిగి ఉంది. క్రిప్టో మార్కెట్లో కొనసాగుతున్న సానుకూల వాతావరణం నేపథ్యంలో రానున్న రోజుల్లో బిట్‌కాయిన్ 1,00,000 డాలర్లకు చేరుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.