- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Siddaramaiah : 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర : సీఎం సిద్ధరామయ్య
దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష బీజేపీ(BJP)కి చెందిన అగ్రనేతలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు. చెరో రూ.50 కోట్లు ఇచ్చి 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను(Congress MLAs) కొనేందుకు బీజేపీ యత్నించిందని ఆయన ఆరోపించారు. పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలను కొనడం ద్వారా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాషాయ పార్టీ కుట్ర చేసిందని ఆయన తెలిపారు. బుధవారం మైసూరు జిల్లా టి.నరసిపుర అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.470 కోట్లు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను సీఎం సిద్ధరామయ్య ప్రారంభించారు.
ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ‘‘బీజేపీ ఆఫర్‌కు ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఓకే చెప్పలేదు. ఆ అక్కసుతోనే నాపై తప్పుడు కేసులను కాషాయ పార్టీ బనాయిస్తోంది. ఏదోలా మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తోంది’’ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ‘‘ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇచ్చేంత డబ్బు బీజేపీకి ఎక్కడిది ? మాజీ సీఎంలు యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, అసెంబ్లీలో విపక్ష నేత ఆర్.అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రలు నోట్లను ప్రింట్ చేస్తున్నారా ? అదంతా అవినీతి సొమ్మే. అందుకే నీళ్లలా ఖర్చు చేసేందుకు రెడీ అయ్యారు’’ అని ఆయన కామెంట్ చేశారు.