- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Lagcherla : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. కటారా! లగచర్ల దాడిపై సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: లగచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దాడి ఘటనపై పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy) స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు అంటూ పేర్కొన్నారు. దాడి చేసేలా జనాలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారని తెలిపారు. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్‌గా పోలీసులు గుర్తించారని వెల్లడించారు.
దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు సురేష్ మాట్లాడారని ఆరోపించారు. సురేష్ తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్ తో ఫోన్లో మాట్లాడిన పట్నం నరేందర్ రెడ్డి అంటూ ఆరోపించారు. సురేష్ పై రేప్ కేసుతో సహా పలు కేసులు ఉన్నాయని, సురేష్ పై కేసులు తొలగించేలా పట్నం నరేందర్ రెడ్డి సహాయం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై జరిగిన దాడి ఘటనలో పలువురు గ్రామస్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.