- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS : పెద్ద సార్ జాతీయ పార్టీ నినాదం..చిన్న సార్ ప్రాంతీయ పార్టీ రాగం : కేటీఆర్ వ్యాఖ్యలతో కన్ఫ్యూజన్ లో కేడర్
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్(Brs) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన తాజా వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ మనుగడపై మరోసారి పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేశాయి. కేటీఆర్ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మహారాష్ట్ర ప్రజలారా బీజేపీ, కాంగ్రెస్ కు ఓటు వేయకండి..ప్రాంతీయ పార్టీలకే ఓటు వేయండని కోరారు. ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయండని, బీజేపీని ఆపే దమ్ము కాంగ్రెస్ కు లేదని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్, బెంగాల్ లో బీజేపీని నిలువరించింది ప్రాంతీయ పార్టీలేనంటూ చెప్పుకొచ్చారు. అయితే తాను వర్కింగ్ ప్రెసిండెంట్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చిన సంగతి కేటీఆర్ విస్మరించరా లేక ప్రాంతీయ పార్టీ వాదమే బీఆర్ఎస్ ను తిరిగి బలపేతం చేస్తుందన్న వ్యూహంతో మాట్లాడుతున్నారా అన్న గందరగోళంపార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఇది ఇలా ఉండగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకోస్తామంటూ 2022 అక్టోబరు 5న నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానించారు. 2022 డిసెంబరు 22న తెలంగాణ శాసనసభ, తెలంగాణ శాసనమండలిలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారుస్తూ బులెటిన్ జారీ చేసింది. 2023 జనవరి 2న అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ తన స్థానిక విభాగాన్ని సృష్టించింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేసింది. పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులతో ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామని, భూకంపం పుట్టిస్తామంటు కేసీఆర్ గర్జించారు. పార్టీ మార్పు తర్వాతా మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తొలి విజయం సాధించింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఊహించని విధంగా ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానం గెలవకపోగా, పలుచోట్ల మూడో స్థానానికి పరిమితమైంది. ఈ ప్రభావంతో పొరుగు రాష్ట్రాల్లో విస్తరణపై కేసీఆర్ ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు.
గతంలో అధికారంలో ఉండగా కేసీఆర్ కలిసిన...లేక ఆయనను కలిసిన ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులలో ఒక్కరు కూడా అధికారం పోయాక ఆయన దరికి రాలేదు. దీంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరిగా మిగిలారు. అటు పార్టీ శ్రేణులు, నాయకులు కూడా తమకి బీఆర్ఎస్ పేరు కలిసి రాలేదని.. పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ కేటీఆర్, హరీష్ రావులు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ తోనే తెలంగాణ ప్రయోజనాలు సాధ్యమవుతాయంటూ తిరిగి ప్రాంతీయ పార్టీ వాదాన్ని వినిపించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారబోతుందన్న ప్రచారం బలపడింది. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా కేటీఆర్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేలా చేసిన వ్యాఖ్యలు అసలు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అన్న గందరగోళాన్ని గులాబీ కేడర్ లో తిరిగి రగిలించాయి.