ఏథెన్స్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చు

by M.Rajitha |
ఏథెన్స్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చు
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రీస్ లోని చారిత్రక నగరం ఏథెన్స్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. దీంతో అక్కడి ప్రజలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. దాదాపు 500 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది రాత్రీపగలు కష్టపడినప్పటికీ అగ్ని కీలలు అదుపులోకి రావడం లేదు. 152 ఫైర్ ఇంజన్లు, 30 వాటర్ డ్రాపింగ్ విమానాలు మంటలను ఆర్పడానికి ఉపయోగిస్తున్నారు. మారథాన్ సహ ఇతర ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైనిక ఆసుపత్రిని కూడా వేరే ప్రాంతానికి మార్చారు. కార్చిచ్చు కారణంగా వ్యాపించిన పొగ ఏథెన్స్ నగరాన్ని పూర్తిగా కమ్మేసింది. ఈ పొగ వలన అస్వస్థతకు గురై అనేక మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కార్చిచ్చుకు తోడు బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కొన్నిచోట్ల అగ్నికీలలు 80 అడుగుల ఎత్తులో ఉన్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది. ఈ కార్చిచ్చు కారణంగా గ్రీస్ దేశంలోని సగం ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఇంతకముందు 2018లో గ్రీస్ లోని మాటి నగరాన్ని కూడా కార్చిచ్చు కాల్చి బూడిద చేయగా, వంద మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story

Most Viewed