Onion Prices: ఉల్లి ధరల నియంత్రణకు బఫర్ స్టాక్ అమ్మకాలు ప్రారంభించిన ప్రభుత్వం

by S Gopi |
Onion Prices: ఉల్లి ధరల నియంత్రణకు బఫర్ స్టాక్ అమ్మకాలు ప్రారంభించిన ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ఎగుమతి సుంకాన్ని తొలగించిన తర్వాత రిటైల్ ధరలు పెరిగిన నేపథ్యంలో బఫర్ స్టాక్ అమ్మకాలను వేగవంతం చేయాలని, తద్వారా ఉల్లి ధరలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఢిల్లీ సహా ఇతర ముఖ్య నగరాల్లోని హోల్‌సేల్ మార్కెట్‌లలో బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే సోమవారం తెలిపారు. దేశవ్యాప్తంగా రాయితీ ధరకు ఉల్లిని రిటైల్ మార్కెట్లో విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎగుమతి సుంకం ఎత్తివేయడం వల్ల ధరలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దానివల్ల 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికితోడు ఖరీఫ్‌లో పెరిగిన ఉల్లి పంటతో ధరలు దిగొస్తాయని నిధి ఖరె చెప్పారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేంద్రం సగటు ధర కంటే తక్కువగా రూ. 35తో రిటైల్ మార్కెట్లో ప్రభుత్వం విక్రయిస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఢిల్లీలో ఉల్లి ధర కిలో రూ. 55 ఉండగా, ముంబైలో రూ. 58, చెన్నైలో రూ. 60గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed