US Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన ఏడు రాష్ట్రాలు.. ఆ ఏడు రాష్ట్రాలు ఏవేవి..?

by Maddikunta Saikiran |
US Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన ఏడు రాష్ట్రాలు.. ఆ ఏడు రాష్ట్రాలు ఏవేవి..?
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్ర రాజ్యం అమెరికాలో వచ్చే నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరుపున భారత సంతతి మహిళ కమలా హారీస్ పోటీ చేయనుండగా , రిపబ్లిక్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి పోటీ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేల అధ్యక్ష అభ్యర్థులిద్దరు తమ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ ఎన్నికల్లో సుమారు 24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లోని ఏడు రాష్ట్రాలు కీలకం కానున్నాయి. ఈ రాష్ట్రాల్లోని ఓటర్లే దేశాధ్యక్షుడు ఎవరనేది నిర్ణయిస్తాయని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈ ఏడు రాష్ట్రాల్లో తటస్థంగా ఉన్న ఓటర్ల మనస్సులు దోచుకోవడంపైనే ఇరువురు నేతలు ఫోకస్ చేశారని తెలుస్తోంది.

ఆ ఏడు రాష్ట్రాలు ఏంటి..?

అరిజోవా, జార్జియా, మిషిగాన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విష్కాన్సిన్ అనే రాష్ట్రాలు ఈ ఏడు రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. అరిజోవా రాష్ట్రం 2020 లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ రాష్ట్రం రిపబ్లికన్ పార్టీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీకి ఓటేశారు. ఈ నేపథ్యంలో 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ అరిజోవా రాష్ట్రం కీలకం కానున్నది. ఇక జార్జియాలో ఆఫ్రికన్ అమెరికన్ పౌరులు భారీగా నివసిస్తున్నారు. ఈ రాష్ట్రంలోని ఓటర్లు జో బైడెన్ విజయంలో ముఖ్య భూమిక పోషించారు. అలాగే మరో రాష్ట్రం మిషిగాన్, గత రెండు ఎన్నికల్లో అధ్యక్షుడి ఎన్నికలో కీలకంగా వ్యవరించింది. కాగా ఈ రాష్ట్రంలో అరబ్ అమెరికన్లు ఎక్కువ మంది ఉంటారు. ఇజ్రాయెల్ కు బైడెన్ మద్దతు తెలుపడంపై మిషిగాన్ రాష్ట్రంలో చాలా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇకపోతే నెవడా రాష్ట్ర ఓటర్లను నిరుద్యోగం, ఆర్థిక వృద్ధిరేటు ప్రభావితం చేసే అంశంగా ఉంది. పన్నులు తగ్గిస్తామని, నియంత్రణలు తగ్గిస్తామని ఇరు పార్టీకి చెందిన అధ్యక్ష అభ్యర్థులిద్దరు అక్కడి ఓటర్లకు హామీలు ఇస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్న ఘటన నార్త్ కరోలినా రాష్ట్ర ఓటర్లను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారీగా ద్రవ్యోల్బణం పెరగడం వల్ల పెన్సిల్వేనియా రాష్ట్ర ఓటర్లు డెమోక్రాటిక్ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటె 2016,2020 ఎన్నికల్లో కీలకంగా ఉన్న విస్కాన్సిన్ రాష్ట్రం నుంచి ఈ సారి గ్రీన్ పార్టీ పోటీలో దిగింది. ఓట్లు చీలిపోయే అవకాశముండటంతో ఈ రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీకి కొంత మేరకు నష్టం వాటిల్లె ప్రమాదం ఉంది.

Advertisement

Next Story

Most Viewed