- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. దీపావళి నుంచి అమల్లోకి మరో పథకం
దిశ, వెబ్ డెస్క్: ఏపీ (Andhra Pradesh)లో మహిళలకు ప్రభుత్వం శుభవార్త (Good News) తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళల(Womens)కు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ పథకం అమలుపై తాజాగా సీఎం చంద్రబాబు (Cm Chandrababu) క్లారిటీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా (Prakasam District) మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు.. దీపావళి (Diwali)కి ఉచిత గ్యాస్ (Free Gas) పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాము చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు. మద్దిరాలపాడులో అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టిస్తామన్నారు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీళ్ల కుళాయిలు, కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తామన్నారు. మసీదును అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యాన్ని ఎవరూ డైవర్ట్ చేయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.