బఫర్ జోన్,చెరువులు,కుంటలులో ఎలాంటి అక్రమ నిర్మాణం చేయరాదు : ఎమ్మెల్యే సంజయ్

by Aamani |
బఫర్ జోన్,చెరువులు,కుంటలులో ఎలాంటి అక్రమ నిర్మాణం చేయరాదు :  ఎమ్మెల్యే సంజయ్
X

దిశ,జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల పట్టణ గల్ఫ్ గంగపుత్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ హయం లోనే గంగా పుత్రులకు,సొసైటీ లకు పూర్తి స్థాయిలో చెరువులపై అధికారం ఇవ్వడం జరిగిందని,జగిత్యాల నియోజకవర్గంలో మత్స్య కార్మికులు చనిపోతే,కాలయాపన లేకుండా 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కులు అందజేయటం జరిగింది అని అన్నారు. మత్స్యకారులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,జగిత్యాల నియోజకవర్గం లో ఇటీవల మరణించిన 8 మందికి కలెక్టరేట్ లో ప్రొసీడింగ్స్ కాపీ లు సిద్ధం చేస్తున్నారని ,ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, బఫర్ జోన్,చెరువులు,కుంటలు లో ఎలాంటి అక్రమ నిర్మాణం చేయరాదన్నారు.

గంగపుత్రులకు మోపెడ్ లు,సేఫ్టీ కిట్ లు త్వరలోనే అందజేసే ఆలోచన ప్రభుత్వం దృష్టి సారించింది అన్నారు,ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని పరిష్కరిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు తిరుపతి,కౌన్సిలర్ జుం భర్తీ రాజ్ కుమార్,FCS డైరెక్టర్ ఆరుముళ్ళపవన్ ,నాచుపల్లి రెడ్డి,మాజీ ఎంపీటీసీ తురగ రాజీ రెడ్డి, FCS సంఘం అద్యక్షులు గుమ్ముల అంజయ్య,శ్రీనివాస్,సంఘం సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed