గౌరవ్ గొగోయ్ భార్య పాక్ లింకులపై సిట్

by John Kora |
గౌరవ్ గొగోయ్ భార్య పాక్ లింకులపై సిట్
X

- వెల్లడించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో డిప్యూటీ అపోజిషన్ లీడర్ గౌరవ్ గగోయ్ భార్య ఎలిజబెట్ కాల్‌బర్న్‌కు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐతో లింకులు ఉన్నాయని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎలిజబెత్‌కు పాకిస్తాన్‌తో లింకులు ఉన్నాయన్న విషయంపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారని, ఆ అంశంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. గౌరవ్ గొగోయ్ తండ్రి తరుణ్ గొగోయ్ అస్సాంకు సీఎంగా ఉన్న సమయంలో సీఎంవోలో ఉన్న ఎవరెవరితో ఐఎస్ఐ సంప్రదింపులు జరిపింది. ఈ వ్యవహారంలో మొత్తం ఎంత మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎంత మంది సానుభూతిపరులు ఉన్నారో అనే విషయాలు సీట్ విచారణలో తేలుతుందని హిమంత బిశ్వ శర్మ అన్నారు. కాగా, ఈ విషయంపై గౌరవ్ గొగోయ్ ఇప్పటికే స్పందించారు. బీజేపీ చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని, తాను వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.

Next Story