మనం క్రికెటర్లం.. యాక్టర్స్, సూపర్‌స్టార్స్ కాదు.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు

by Harish |
మనం క్రికెటర్లం.. యాక్టర్స్, సూపర్‌స్టార్స్ కాదు.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్‌లో సెలెబ్రిటీ సంస్కృతిపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లను దేవుళ్లుగా భావించడం మానేయాలని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్.. భారత క్రికెట్‌లో అనేక విషయాలపై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాడు. ‘భారత్ క్రికెట్‌లో పరిస్థితులన్నీ సాధారణంగా మార్చడం అత్యంత ముఖ్యం. భారత జట్టులో సూపర్‌ స్టార్‌డమ్, సూపర్ సెలెబ్రిటీలను ప్రోత్సహించకూడదు. మేము యాక్టర్స్ లేదా సూపర్‌స్టార్స్ కాదు. మేము క్రీడాకారులం. క్రికెటర్లం. సామాన్య ప్రజల్లో ఒకరిగా ఉండాలి. వారు మనతో పోల్చుకునేలా వ్యవహరించాలి.’అని చెప్పాడు. అలాగే, వ్యక్తిగత రికార్డులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దన్నాడు. ‘ఉదాహరణకు రోహిత్, కోహ్లీలా ఇప్పటికే మీరు ఎన్నో ఘనతలు సాధించి ఉంటే.. మీరు మరో శతకం సాధిస్తే అది గొప్ప మైలురాయిగా భావించొద్దు. ఈ ఘనతల కంటే గొప్ప లక్ష్యాలు పెట్టుకొని ఆడాలి.’అని సూచించాడు.


Next Story

Most Viewed