అక్రమ వలసదారులతో అమృత్‌సర్‌లో దిగిన విమానం

by John Kora |
అక్రమ వలసదారులతో అమృత్‌సర్‌లో దిగిన విమానం
X

- రెండో విడతలో 119 మందిని వెనక్కు పంపిన అమెరికా

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులను ఆ దేశం డీపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో రెండో విడత భారత అక్రమ వలసదారులను శనివారం అమెరికా మిలటరీ విమానంలో అమృత్‌సర్‌లో దిగింది. ఈ విమానంలో 119 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొని వచ్చారు. యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ అమృత్‌సర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రాత్రి 11.40కు ల్యాండ్ అయ్యింది. ఫిబ్రవరి 5న వచ్చిన విమానాన్ని టెక్నికల్ ఎయిర్ పోర్టులో దించగా.. ఈ విమానాన్ని సివిల్ ఎయిర్‌పోర్టులో దించినట్లు తెలిసింది. ఇందులో 67 మంది పంజాబీలు, 33 మంది హర్యానాకు చెందిన వలసదారులు ఉన్నారు. వీరితో పాటు గుజరాత్ నుంచి 8, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. కాగా, అక్రమ వలసదారులను రిసీవ్ చేసుకోవడానికి పంజాబ్ సీఎం భగవంత్ మన్, ఇమ్మిగ్రేషన్ అధికారులతో పాటు.. బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Next Story

Most Viewed