- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాశ్చాత్య దేశాలది ద్వంద్వ వైఖరి

- భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం లేదు
- 80 కోట్ల మందికి రేషన్ అందుతుంది
- రష్యా నుంచి కొనడం వల్లే ధరలు అదుపులో ఉన్నాయి
- ప్రజాస్వామ్యం తిండిపెట్టదన్న యూఎస్ సెనెటర్
- గట్టిగా సమాధానం ఇచ్చిన ఎంఈఏ జై శంకర్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రజాస్వామ్యాన్ని ఆచరించే విషయంలో పాశ్చాత్య దేశాలది ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నాయి. ప్రజాస్వామ్యం అనేది తమ లక్షణం అని పాశ్చాత్య దేశాలు భావిస్తాయి. కానీ అదే సమయంలో ఇతర దేశాలపై అప్రజాస్వామిక శక్తులను ప్రోత్సహిస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రి (ఎంఈఏ) జై శంకర్ మండిపడ్డారు. జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లోని ప్యానెల్ డిస్కషన్‌లో మంత్రి జైశంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా 'ప్రజాస్వామ్యం తిండి పెట్టదు' అని యూఎస్ సెనేటర్ ఎలీసా స్లాకిన్ చేసిన వ్యాఖ్యలను జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. భారత్‌లో అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానం ప్రజంచంలోని పలు దేశాలు అనుసరించడానికి వీలుగా ఉంది. గ్లోబల్ సౌత్ (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్) దేశాల్లో ఈ ప్రజాస్వామ్యం విజయవంతమైందని జైశంకర్ అన్నారు. వర్ధమాన దేశాల విజయవంతమైన నమూనాలను పాశ్చాత్య దేశాలు అనుసరిస్తే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉంటుందని జైశంకర్ సూచించారు. ఇప్పటికే తమదే సరైన ప్రజాస్వామ్యమని ఇతర దేశాల్లో అనుసరిస్తున్నది తక్కువదని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయని అన్నారు.
ఒకప్పుడు పశ్చిమ దేశాలు ప్రజాస్వామ్యాన్ని పాశ్చాత్య లక్షణంగా భావించాయి. అదే సమయంలో గ్లోబల్ సౌత్ దేశాల్లో అప్రజాస్వామిక శక్తులను ప్రోత్సహించడంతో బిజీగా ఉన్నాయి. ఇప్పటికీ వారి ధోరణి అలాగే ఉంది.ఈ విషయాన్ని నేను నిజాయితీగా చెబుతున్నానని జై శంకర్ చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా మనుగడ సాగిస్తుందని అన్నారు. దేశంలో జరిగిన అభివృద్ధే ప్రజాస్వామ్యానికి సూచిక అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థకు నిలువుటద్దమని పేర్కొన్నారు. ప్రపంచంలో విజయవంతమైన ఇతర ప్రజాస్వామ్య విజయాలను పాశ్చాత్య దేశాలు గుర్తించి.. వాటిని తమ దేశ వ్యవస్థలో భాగం చేసుకోవాలని సూచించారు.
80 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నాం..
ప్రజాస్వామ్యం తిండి పెట్టదు అన్న యూఎస్ సెనేటర్ వ్యాఖ్యలపై జైశంకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మా దేశంలో ప్రజాస్వామ్యం 80 కోట్ల మందికి తిండి పెడుతుందని చెప్పారు. నేను వేలు చూపిస్తున్నాను.. కానీ మీరు తప్పుగా అనుకోకండి. ఇటీవల మా రాష్ట్రమైన ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి. నా గోరుపై ఉన్న సిరా.. నేను ఓటు వేశాను అనడానికి గుర్తు. అంతకుముందు మాకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇండియాలో అర్హత కలిగిన ఓటర్లలో మూడింట రెండొంతుల మంది ఓటు వేస్తారు. మా దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. 70 కోట్ల మంది ఓటేశారు. మేము మా ఓట్ల లెక్కింపును ఒక్క రోజులోనే పూర్తి చేస్తామంటూ అమెరికా సెనేటర్‌కు కౌంటర్ ఇచ్చారు. మా దేశంలో 80 కోట్ల మందికి రేషన్ అందుతుంది. ఇది ప్రజాస్వామ్య విజయమే అని చెప్పారు.
ప్రజాస్వామ్య వ్యవస్థపై కొంత మంది విశ్లేషణలు చేస్తుంటారు. వాళ్లంతా స్వయం ప్రకిట మేధావులు. వీళ్ల వల్లే అసలు సమస్య మొదలవుతుంది. వీళ్లు ఏ ఎన్నికలోనూ పోటీ చేయరు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయరు. కానీ ప్రజాస్వామ్యం గురించి సలహాలిస్తుంటారని జైశంకర్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం విషయంలో పాశ్చాత్య దేశాలు ఏమీ చేయవని, కానీ ఇండియా విషయానికి వచ్చే సరికి ద్వంద్వ నీతిని అనుసరిస్తాయని జై శంకర్ దుయ్యబట్టారు.
మా వల్లే చమురు ధరలు పెరగలేదు..
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో చమురు కొనుగోళ్లపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. కానీ భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసింది. ఇండియా తన కొనుగోలు విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగకుండా నిరోధించిందని జై శంకర్ చెప్పారు. ఇది యూరోపియన్ మార్కెట్‌తో పోటీని నిరోధించిందని అన్నారు. రష్యా కొనుగోళ్లు మీకు సమస్యగా ఉన్నాయి. కానీ మాకు ఎందుకు సమస్యగా ఉంటుంది. మేము అనేక ఆప్షన్‌లను కలిగి ఉన్నాం. ఇలాంటి విషయంలో మమ్మల్ని మీరు మెచ్చుకోవాలని జైశంకర్ చెప్పారు. కాగా మ్యూనిక్‌లోజరిగిన ఈ ప్యానల్ మీటింగ్‌లో జైశంకర్‌తో పాటు నార్వే ప్రధాని జోనాస్ గర్‌స్టోర్, వార్సా మేయర్ రమఫల్ ట్రజ్‌స్కోవ్, యూఎస్ సెనేటర్ ఎలిసా స్లాకిన్ పాల్గొన్నారు.