Bumra : పేసర్లకు కెప్టెన్సీపై తాత్కలిక సారధి బుమ్రా కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
Bumra : పేసర్లకు కెప్టెన్సీపై తాత్కలిక సారధి బుమ్రా కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : కెప్టెన్‌గా పేసర్లను కొనసాగించడాన్ని సమర్ధిస్తా అని భారత జట్టు తాత్కలిక బుమ్రా అన్నాడు. గురువారం పెర్త్ టెస్ట్ కన్నా ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా మాట్లాడాడు. ‘కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించడంలో పేస్ బౌలర్లు బెటర్. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కపిల్ దేవ్‌తో సహా అనేక మంది పేస్ బౌలర్లు కెప్టెన్ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించారు. రానున్న రోజుల్లో ఈ సంప్రదాయం కొనసాగాలని కాంక్షిస్తున్నా..’అని బుమ్రా అన్నాడు. గెలిచిన ఓడిన జీరో నుంచే ప్రయాణం స్టార్ట్ అవుతుందని తెలిపాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో అనేక అంశాలను నేర్చుకున్నామని.. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఫలితాన్ని పట్టించుకోబోమని చెప్పాడు. పెర్త్ టెస్ట్‌కు ప్లేయింగ్ 11 సిద్ధమైందని అయితే టాస్ సందర్భంగా ఆ సీక్రెట్ రివీల్ చేయనున్నట్లు తెలిపాడు. జట్టు సారధిగా బాధ్యతలు నిర్వహించడాన్ని మంచి అవకాశంగా తీసుకుంటానని.. అయితే పొజిషన్ దక్కిందని భావించడం లేదన్నాడు. బాధ్యత తీసుకోవడాన్ని ఇష్టపడతానని బుమ్రా అన్నాడు. రోహిత్ శర్మతో ఇప్పటికే మాట్లాడాను. ఆస్ట్రేలియాకు వచ్చాకే జట్టును నడిపించడం పట్ల అవగాహన వచ్చిందన్నాడు.

Advertisement

Next Story

Most Viewed