రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి : కలెక్టర్

by Kalyani |
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి : కలెక్టర్
X

దిశ, జిన్నారం: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు సూచించారు. గురువారం జిన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రం వద్ద అందుతున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. పలు సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వాటిని తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

రోడ్డు పనుల పై ఫిర్యాదు

జిన్నారంలోని 1002 సర్వే నంబర్ లో గల ప్రభుత్వ భూమిలో 100 ఫీట్ల రోడ్డును ప్రైవేటు వ్యక్తులు వేస్తున్న విషయాన్ని జిన్నారం గ్రామస్తులు కలెక్టర్ క్రాంతి వల్లూరు కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తహసీల్దార్ తో మాట్లాడిన కలెక్టర్ తక్షణమే రోడ్డు పనులను ఆపేయాలని ఆదేశించారు. రోడ్డు పనులను ఆపేలా అధికారులను కలెక్టర్ ఆదేశించడంతో స్థానిక ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జిన్నారం గ్రామానికి చెందిన రైతులు సర్వేనెంబర్ 1 సమస్యను కలెక్టర్ కు వివరించారు. భూములను ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్న తమకు 600 గజాల స్థలాన్ని ఇవ్వలేదని, తమ భూమిని తమకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్ ను కోరారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed