AP Assembly:చెత్త పన్ను రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP Assembly:చెత్త పన్ను రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొంగూరు నారాయణ(Minister Narayana) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో నేడు(గురువారం) చెత్త పన్ను రద్దు బిల్లును ఏపీ పురపాలక శాఖ(AP Municipal Deptt) మంత్రి నారాయణ(Minister Narayana) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చెత్త సేకరణకు పన్ను విధించిందని అన్నారు. రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు.

చెత్త సేకరణకు నెలకు రూ.51,641 నుంచి రూ.62,964 వరకు చెల్లించారని ఆరోపించారు. నివాస గృహాల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.120 వరకు సేకరించారని, కమర్షియల్ కాంప్లెక్స్ ల నుంచి రూ.100 నుంచి రూ.10 వేల వరకు సేకరించారని మంత్రి నారాయణ(Minister Narayana) వెల్లడించారు. చెత్త పన్ను ను నిరసిస్తూ మహిళలు నాడు ధర్నాలు కూడా చేశారని మంత్రి వివరించారు. 16-10-2024 లో జరిగిన మంత్రి మండలిలో చెత్త పన్ను రద్దు చేసేందుకు తీర్మానించాం అని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో చెత్త పన్ను తొలగిస్తామని తాము ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఆ మేరకు ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed