మానుకోట కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు..

by Aamani |   ( Updated:2024-11-21 14:03:42.0  )
మానుకోట కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు..
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మానుకోట కలెక్టరేట్లో గురువారం ఏసీబీ సోదాలు నిర్వహించారు. లంచం రూ. 20,000 తీసుకుంటూ సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ లో సీనియర్ డాక్యుమెంట్ గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి శర్మ బాయ్ పట్టుబడ్డారు. పూర్తి వివరాలు వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ కు చెందిన తాళ్ల కార్తీక్ అనే వ్యక్తి గత నెల 28వ తారీఖున జ్యోతి శర్మ ను కలిసినట్లు తెలిపారు. ఆయన మూడు ఎకరాల భూమి కొనుగోలు కోసం టిపన్ పెట్టాలని ఆమె కోసం వెళ్లడం జరిగింద అని తెలిపారు. జ్యోతి శర్మ రూ. 20000 లంచం అడగడంతో తాళ్ల కార్తీక్ అనే వ్యక్తి వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కలిసినట్లు తెలిపారు. మధ్యాహ్నం సర్వే అండ్ ల్యాండ్ రికార్డు కార్యాలయంలో సోదాలు నిర్వహించి రూ. 20000 ఇస్తుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ కార్యాలయానికి తెలపాలని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed