Thammineni Veerbhadram: కాంగ్రెస్ కు మద్దతుపై సీపీఎం తమ్మినేని వీరభద్రం హాట్ కామెంట్స్

by Prasad Jukanti |
Thammineni Veerbhadram: కాంగ్రెస్ కు మద్దతుపై సీపీఎం తమ్మినేని వీరభద్రం హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లగచర్లలో పోలీసుల దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అన్నారు. కలెక్టర్ పై ఎవరైనా కొంత మంది దాడి చేస్తే అది తప్పేనని అయితే ఆ తర్వాత లగచర్ల (Lagacharla) గ్రామస్తులపై పోలీసుల దాడి హేహ్యమైనదన్నారు. గురువారం లగచర్ల బాధితులను వామపక్ష పార్టీలు పరామర్శించాయి. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళలపై పోలీసులు అసభ్యకర రీతిలో తాకరాని చోట తాకుతూ దాడులకు పాల్పడ్డారని బాధితులే చెబుతున్నారన్నారు. లగచర్ల రైతులపై జరిగిన దాడిలో ప్రభుత్వం క్షమాపణలు చెప్పి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లగచ్లలో ఒక్క సెంటు భూమి కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీళ్లేదని అన్నారు. లగచర్ల బాధితుల పక్షాన చివరి వరకు ఎర్రజెండాలు అండగా నిలుస్తాయన్నారు. లగచర్ల ఘటనను దాడి అనవద్దని కలెక్టరే చెబుతుంటే వాస్తవానికి విరుద్ధంగా ప్రభుత్వ వర్గాలు, మంత్రులు దీన్ని దాడిగా చిత్రీకరిస్తూ రాజకీయం చేసే ప్రయత్నాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇక్కడ తామేమి బీఆర్ఎస్ ను సమర్థించడం లేదని బీఆర్ఎస్ ఇంతకంటే పాపపు పార్టీ అన్నారు. గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఫార్మాసిటీ పేరుతో వందలాది ఎకరాలు లాక్కున్నదన్నారు.

హామీలు నెరవేర్చుతే తాము మద్దతు ఇస్తాం:

లగచర్లకు బయలుదేరే ముందు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన తమ్మినేని హాట్ కామెంట్స్ చేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి బాధ్యతాయుతంగా పరిపాలన చేస్తే తాము కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు. ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నావంటే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్రమం ఏంటో దీంట్లోనే తెలుస్తుందన్నారు. ప్రతిపక్షాలను, మీడియాను అడ్డుకుంటున్నావంటే రేవంత్ రెడ్డి ఎంత భయపడుతున్నారో అర్థం అవుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed