- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన డా. అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు(Akkineni Nageswara Rao National Award) వేడుక హైదరాబాద్ లో జరగనుంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి అక్కినేని జాతీయ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డును ఈ నెల (అక్టోబర్) 28న చిరంజీవికి ప్రదానం చేయనున్నారు. కాగా అక్కినేని జాతీయ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబచ్చన్(Amita Bachchan) రానున్నట్లు తెలుస్తుంది. కాగా ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్ లోని ఆర్కే సినీ ప్లేక్స్‌లో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు డైరెక్టర్ రాఘవేంద్ర రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో నాగార్జున(Nagarjuna) మాట్లాడుతూ.. నాన్న మాకు నవ్వుతూ జీవించడం నేర్పించారు. అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో అభిమానులు రక్తదానం చేశారు. నాన్నపై అభిమానులు చూపించిన ఆదరణ మా కుటుంబం ఎప్పుడూ మర్చిపోదు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఏఎన్ఆర్ అవార్డులు ఇస్తున్నాము. ఈ ఏడాది హీరో చిరంజీవికి ఈ అవార్టును ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. అక్టోబర్ 28(October 28)న ఏఎన్ఆర్ అవార్డు ప్రదాన కార్యక్రమం(ANR Award Ceremony) జరుగుతుందని హీరో నాగార్జున చెప్పుకొచ్చారు.
Read More : ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్ణం నాకు కలిగింది: చిరంజీవి