- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral: వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చెడగొట్టాలి..! ఇదే అతని జాబ్!!
దిశ, ఫీచర్స్ : వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చెయ్యాలనేది సామెత. సంబంధాలు కలపడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది పుట్టుకొచ్చిందని చెప్తారు. సాంకేతిక పరిజ్ఞానం, రవాణా సౌకర్యం అందుబాటులో లేనిరోజుల్లో సంబంధం చూడటం మొదలు పెళ్లి అయిపోయే వరకు చాలా ప్రాసెస్ జరిగేది. అప్పట్లో సంబంధాలు కలిపేవారిని సరదాగా పెళ్లిళ్ల పేరయ్య అని పిలిచేవారు. ఒక విధంగా చెప్పాలంటే నేటి మ్యారేజ్ బ్యూరోలకంటే కూడా వీరికి ఎక్కువ క్రేజ్ ఉండేది ఆనాడు. కానీ కాలక్రమంలో వారి హవా తగ్గింది. ప్రస్తుతం మోట్రిమోని సైట్లు, డబ్బులు తీసుకొని సంబంధాలు సెట్ చేసే మ్యారేజ్ బ్యూరోలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ డబ్బులు తీసుకొని పెళ్లి సంబంధాలు కుదుర్చుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం చెడగొట్టడమే తన వృతిగా ఎంచుకున్నాడు. ప్రస్తుతం అదే అతని ఉద్యోగంలా మారిపోయింది.
అతన్ని సంప్రదిస్తే చాలు
ముందు పెళ్లి ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత ఏవో కారణాలతో ఆ సంబంధం కొందరికి నచ్చదు. కానీ అప్పటికే ఇచ్చిన మాట, నలుగురిలో గౌరవం కోసం క్యాన్సిల్ చేసుకోవడానికి వెనుకాడుతారు. అలా చేయడం అసాధ్యం కూడా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చెడగొట్టడమే పాలసీగా పెట్టుకున్నాడు స్పెయిన్ దేశానికి చెందిన ఎర్నెస్టో అనే వ్యక్తి. తనను సంప్రదిస్తే చాలు ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి చెడగొట్టేస్తాడు. ఇక ఎవరైతే తమ పెళ్లి చెడగొట్టాలని ఇతన్ని ఆశ్రయిస్తారో వారిదగ్గర మొదటి దఫాగా రూ. 46,135 ఫీజు వసూలు చేస్తాడట ఎర్నెస్టో. ఆ తర్వాతే పెళ్లి చెడగొట్టే పనిలో నిమగ్నమై సక్సెస్ చేస్తాడు. ఈ విషయాన్ని అతను ఇటీవల సోషల్ మీడియాలో కూడా వెల్లడించాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ‘మ్యారేజ్ బ్రేక్’ చేయాలని అతన్ని సంప్రదిస్తున్నారట.
ఎలా చెడగొడతాడు?
ఎర్నెస్టో ‘మ్యారేజ్ బ్రేకింగ్’ కష్టమర్ల నుంచి ఫీజు తీసుకోగానే రంగంలోకి దిగుతాడు. సంబంధిత వధూ వరులు, వారి కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తాడు. అంతకు ముందు ఏవేవో చాడీలు చెప్తూ నటిస్తాడు. అయినా పెళ్లి క్యాన్సిల్ కాలేదంటే.. సరిగ్గా పెళ్లి జరుగుతున్న వేదిక వద్దకు వస్తాడు. అక్కడ అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవర్నో ఒకర్ని ఎంతో కాలంగా లవ్ చేస్తున్న వ్యక్తిలాగా నటిస్తూ పారిపోదాం పద అని అందరికీ అనుమానం వచ్చేలా చేస్తాడు. అంతే ఇక.. ఆ నటనకు అమ్మాయి లేదా అబ్బాయి తరపు వారు ఎవరో ఒకరు తమకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ క్యాన్సిల్ చేసేసుకుంటారు. ముందే తమ పెళ్లి చెడగొట్టాలని ఎర్నెస్టోను సంప్రదించిన వ్యక్తులు సక్సెస్‌ఫుల్‌గా పెళ్లి చెడగొట్టినందుకు తర్వాత తమ ఇష్టాన్ని బట్టి మరోసారి బహుమతులు, డబ్బులు కూడా ఇచ్చుకుంటారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.