US -Syria: సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. 37 మంది ఉగ్రవాదులు మృతి

by Harish |   ( Updated:2024-09-29 13:49:12.0  )
US -Syria: సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. 37 మంది ఉగ్రవాదులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా అమెరికా సైన్యం ఆదివారం సిరియాపై వైమానిక దాడులు చేసింది. ఫలితంగా తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌, అల్-ఖైదాతో సంబంధం ఉన్న 37 మంది తీవ్రవాదులు మృతి చెందినట్లు అమెరికా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ఇద్దరు కీలక ఉగ్రవాదులు కూడా చనిపోయినట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికే లెబనాన్‌లో ఇజ్రాయెల్ దళాలు తీవ్ర దాడులు చేస్తుండగా, ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా, సిరియాపై విరుచుకుపడుతుంది.

అమెరికా దళాలు ఈ నెల ప్రారంభం నుండి సిరియాపై దాడులు చేయడం ప్రారంభించింది. ఇటీవల సిరియాలోని IS శిక్షణా శిబిరంపై పెద్ద ఎత్తున వైమానిక దాడిని నిర్వహించింది. ఈ దాడిలో కనీసం నలుగురు సిరియా అగ్ర నాయకులతో సహా 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికా ప్రయోజనాలతో పాటు, మిత్ర దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు సిరియాలో ఉన్న ISIS శిబిరాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్లు అమెరికా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed