Trump Supporters : చెవికి బ్యాండేజీతో ట్రంప్‌ అభిమానులు.. క్రియేటివ్ సంఘీభావం

by Hajipasha |
Trump Supporters : చెవికి బ్యాండేజీతో ట్రంప్‌ అభిమానులు.. క్రియేటివ్ సంఘీభావం
X

దిశ, నేషనల్ బ్యూరో : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంఘీభావం వెల్లువెత్తుతోంది. ప్రస్తుతం విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ అభిమానులు కుడి చెవికి తెలుపురంగు బ్యాండేజీని ధరించి ట్రంప్‌కు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఈనెల 13న పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో కుడిచెవిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. సర్జరీ అనంతరం ట్రంప్ కుడిచెవికి తెల్లటి బ్యాండేజీని పెట్టుకొని.. ఈనెల 15న మిల్వాకీ సిటీలో రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌‌కు హాజరయ్యారు. అందుకే ట్రంప్ అభిమానులు ఒక చెవికి బ్యాండేజీ ధరించి అభిమానాన్ని చాటుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ‌పేరును ఇప్పటికే ఖరారు చేశారు.

Advertisement

Next Story