ఇండోనేషియాలో విషాదం: కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి

by samatah |
ఇండోనేషియాలో విషాదం: కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియాలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండంతో సుమత్రా ద్వీపంలో భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో 19 మంది మృతి చెందగా..అనేక మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్ మృత దేహాలను బయటకు తీశారు. గల్లంతైన వారి కోసం గాలింపుచర్యలు చేపట్టినట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 14 ఇళ్లు సమాధి అయ్యాయని, పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లో 20,000 ఇళ్లు పైకప్పు వరకు నీటమునిగాయని పేర్కొంది. అంతేగాక 80,000 మందికి పైగా ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి కేంద్రాలకు పారిపోయినట్టు వెల్లడించింది.

పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని సెలాటన్ జిల్లా పర్వత ప్రాంతాల్లో టన్నుల కొద్దీ మట్టి, రాళ్లు, చెట్లు పడిపోయినట్టు స్థానిక విపత్తు నిర్వహణ అధికారి డోని యుస్రిజల్ తెలిపారు. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగినట్టు పేర్కొన్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశామని చెప్పారు. కాగా, ఇండోనేషియా ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం గల దేశం. అనేక మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లో లేదా వరద మైదానాలకు సమీపంలో నివసిస్తారు. దీంతో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed